
జమ్మికుంటలో ట్రాలీ బోల్తా – వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. వీణవంక మండలం ఎలుబాక గ్రామం నుంచి నాగారం గ్రామానికి పత్తి ఏరడానికి వెళ్లుతున్న వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాలీ క్రాస్‌రోడ్డు వద్ద బోల్తా పడింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా ట్రాలీ నియంత్రణ కోల్పోయి పడిపోయిందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో ట్రాలీలో ఉన్న అనేక మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు, గ్రామస్తులు తక్షణమే అంబులెన్స్‌లో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
