పట్టభద్రుల సమస్యల పరిష్కారం తో పాటు.. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా పోరాడుతానని, నిరుద్యోగ పట్టభద్రులకు సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బోధనా, బోధనేతర సిబ్బందితో నిర్వహించిన సమాశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పట్టభద్రులకు న్యాయం చేస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాలనలో తీరని అన్యాయం తలపెట్టారని ఆయన విమర్శించారు.బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస రావు, సిరిగినేని కొండల్ రావు, కొత్త తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
