ఉద్యోగ స్టాల్స్ ను ప్రారంభించిన స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ ముక్క హరీష్ బాబు…
జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ , యువకులు

స్వదేశీ మేళాలో భాగంగా ఏర్పాటుచేసిన ఉద్యోగ మహోత్సవ్ కార్యక్రమం మంగళవారం రోజున కరీంనగర్ పట్టణం అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇట్టి ఉద్యోగ మహోత్సవ్ ప్రోగ్రామ్స్ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ ముక్క హరీష్ బాబు ప్రారంభించారు.110 కంపెనీలు, వివిధ సంస్థలు ఇక్కడ ఉద్యోగ స్టాల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాదాపు 6000 నిరుద్యోగ యువతీ యువకులు జాబ్స్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో స్వదేశీ మేళ బాధ్యులు ముక్క హరీష్ బాబు మాట్లాడుతూ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 16 వరకు అంబేద్కర్ స్టేడియంలో తలపెట్టిన ‘స్వదేశీ మేళా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో స్వదేశీ మేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా 6 రోజుల పాటు జరిగే ఈ స్వదేశీ మేళాలో దాదాపు 2 లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా దేశీయ ఉత్పత్తులను సంబంధించి ఇక్కడి స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని, 210కి పైగా స్టాల్స్ బుధవారం నుండి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతయన్నారు. ఉద్యోగాల కల్పన కోసం 110 కంపెనీలు స్వదేశీ మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేశారని , దాదాపు 1000 మందికి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఉద్యోగ మహోత్సవ్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందన్నారు. స్వదేశీ మేళా కో కన్వీనర్ కళ్లెం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ స్వదేశీ మేళా ప్రోగ్రాంలో భాగంగా బుధవారం రోజున పది గంటల నుండి ఒంటిగంట వరకు పాలిటెక్నిక్ , ఇంజనీరింగ్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి ముఖ్యఅతిథిగా పిటిసి సూపరింటెంట్ శ్రీనివాస సుంకర , మాజీ డిఆర్డిఓ డైరెక్టర్ డాక్టర్ సతీష్ రెడ్డి. , విజయానంద్ , ఇంద్రసేనారెడ్డి లాంటి ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. సాయంత్రం వేళ ప్రతిరోజు సాంస్కృతి కార్యక్రమాలు 6 నుండి 9.30 వరకు ఉంటాయని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో స్వదేశీ మేళా బాధ్యులు మాధవరావు, గంప వెంకట్,, ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

