కరీంనగర్: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలని గ్రాడ్యుయేట్లను, నిరుద్యోగులను కోరారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన వెలిచాల రాజేందర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తున్నది అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు.
గతంలో బిఆర్ఎస్ పాలకులు నిరుద్యోగులను మోసం చేశారని, కుటుంబ రాజకీయాలను కాపాడుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందని విమర్శించారు. ఇతర పార్టీల మాయమాటలు నమ్మవద్దని, ఉద్యోగ భవిష్యత్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని గ్రాడ్యుయేట్లను, నిరుద్యోగులను కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
