బెజ్జంకి: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆరె సంక్షేమ సంఘం & హిందూ వాహిని నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో భాగంగా “జై భవాని, జై శివాజీ”, “హర హర మహాదేవ”, “జై శ్రీరామ్” నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఇంగాల నాగమల్లేశం మాట్లాడుతూ, “శివాజీ ఆశయాలను కొనసాగించడం మా బాధ్యత” అని పేర్కొన్నారు. హిందూ వాహిని జిల్లా విధి ప్రముఖ్ దోనె అశోక్ మాట్లాడుతూ, “శివాజీ త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమే. హిందువుల ఏకతాటిపై అఖండ భారత్ సాధనకు ప్రతి యువకుడు కంకణబద్ధుడు కావాలి” అని అన్నారు.అయితే, ప్రభుత్వం శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దోనే రామారావు, గుబిరె మల్లేశం, గుజ్జుల రామారావు, కుటుంబ సంపత్ రావు, తిప్పారం శ్రీనివాస్, దోనే శ్యామ్ రావు, దొడ్ల ప్రశాంత్, తిప్పారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
