
జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామం కు చెందిన వేముల సత్యనారాయణ బుధవారం రోజున పని కోసం జమ్మికుంటకు వెళ్లగా, అతని భార్య సుజాత వనభోజనాల కోసం ఇంటికి తాళం వేసి వెళ్లింది. మధ్యాహ్నం 12:30కి తిరిగి వచ్చిన సత్యనారాయణ, తాళం పగలగొట్టి ఉండగా, బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టగొలుసులు, రూ.26,000 నగదు దొంగిలించబడ్డాయని గుర్తించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
