జమ్మికుంట : మోతుకులగూడెం గ్రామానికి చెందిన పొన్నగంటి రవికుమార్ (32) 15 నెలల క్రితం టిప్పర్ కొనుగొని వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో నష్టాలవల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, “హైదరాబాద్కి వెళ్లి వస్తా” అంటూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుండడంతో భార్య దివ్య అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద విచారించగా సమాచారం దొరకలేదు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్ఫైల్ (మాన్ మిస్సింగ్) కేసు నమోదు చేశారు.
