జమ్మికుంటలో వంట సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా విద్యా శాఖాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట మండలంలో వంట సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మరియు మండల విద్యా శాఖాధికారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.
జమ్మికుంట గ్రామీణ మరియు పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వంట సిబ్బందికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు), జమ్మికుంటలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వరుణ వంట సిబ్బందికి అసంక్రామిత వ్యాధులు అయిన రక్తపోటు, మధుమేహం, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం 68 మంది వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
అలాగే చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. వంట గదిలో సామానుల నిల్వలు సక్రమంగా నిర్వహించుకోవడం, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంతో అవసరమని సిబ్బందికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణులు , , మండల విద్యా శాఖాధికారి హేమలత, హెల్త్ ఎడ్యుకేటర్ , రాధ, మంజుల (ANMలు), ఆశా కార్యకర్తలు మరియు వంట సిబ్బంది పాల్గొన్నారు.
