
జూలూరుపాడు, జూన్ 30 (జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము): జూలూరుపాడు మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంగా ఉండి 1/70 యాక్ట్ అమలులో ఉన్నా, గిరిజనేతర్ల పేరిట ఫెర్టిలైజర్ షాపులు తెరుచుకుంటున్నాయని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గ ప్రసాద్ నాయక్ ఆరోపించారు. మండలంలోని చాలా షాపుల్లో నకిలీ విత్తనాలు అమ్ముడవుతూ అమాయక గిరిజన రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించిన దుర్గ ప్రసాద్, ప్రస్తుతం ఉన్న గిరిజనేతల లైసెన్సులను రద్దు చేసి 100% గిరిజనులకే లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని గౌరవిస్తూ, గిరిజనుల హక్కులను కాపాడాలని ఆయన స్పష్టం చేశారు.
