
ఎన్కూర్, జూన్ 30 (జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము) : ఎన్కూర్ మండలం భద్రతండ గ్రామపంచాయతీ పరిధిలోని మున్యా తండాలోని సిసి రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. వర్షాకాలం మొదలై, రోడ్డుపై నడకే కష్టంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు.
రోడ్డు మరమ్మతులు చేయాలని పంచాయతీ సెక్రటరీకి పలు మార్లు చెప్పినప్పటికీ స్పందన కనిపించలేదని ముత్యాల నందిలాల్, బాధావత్తు నరసింహ లాంటి గ్రామస్థులు వేదన వ్యక్తం చేశారు. రోజూ చిన్నపిల్లలు, వృద్ధులు ఈ రోడ్డుపై నడవాల్సి వస్తోంది. ఎవరైనా పడిపోతే ప్రమాదం తథ్యం. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
