
ఇందిరమ్మ ఇళ్ల ఫైల్ కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం సంబంధిత ఫైల్ ప్రాసెస్ చేయడానికి రూ.10,000/- లంచం కోరిన కార్యదర్శి, డబ్బు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
