సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో వైద్య శిబిరం
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించింది.
పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్న వారికి మందులు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం అని అన్నారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. “డ్రైడే”, “టిబి నిక్షయ్ శిబిరం” & “100 రోజుల ప్రణాళిక” ద్వారా టిబిపై అవగాహన కల్పించారు.
దివ్యాంగులు అధైర్య పడకుండా, మనోధైర్యంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో MLHP డాక్టర్ మహోన్నత పటేల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్, సూపర్వైజర్ అరుణ, పాఠశాల ప్రిన్సిపాల్ రాజు, ఆరోగ్య శాఖ సిబ్బంది సరళ, రజిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
