
వీణవంక : వీణవంక మండలం కనపర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, YuppTV & Turito సంస్థల వ్యవస్థాపకుడు మరియు సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ. 1,01,116/- విరాళంగా అందించారు.
దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి దేవాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వాలని పాడి ఉదయ్ నందన్ రెడ్డిని అభ్యర్థించగా, వెంటనే స్పందించి తన అనుచరుల ద్వారా ఈ విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పర్లపెల్లి రమేష్ మాట్లాడుతూ, “పాడి ఉదయ్ నందన్ రెడ్డి మా గ్రామానికి ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన విశాల హృదయానికి గ్రామస్థులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్, దేవాలయ కమిటీ సభ్యులు పంజాల రాజు, చేతి యాదగిరి, బండారి సారయ్య, తడిగుప్పుల శ్రీనివాస్, తడి రవి, హనుమండ్ల గోపాల్ రెడ్డి, బోయిని రాజు, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, సమీడట్ల చిట్టి, దసారపు లోకేష్, అశోక్, వంశీకృష్ణ, తాళ్లపెల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామస్థులు పాడి ఉదయ్ నందన్ రెడ్డి మరియు ఆయన కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
