తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం రోజున విడుదల చేసిన ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలు మరోసారి తమ శిక్షణా ప్రమాణాలను రుజువు చేశాయి. అన్ని విభాగాల్లోనూ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాలు సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేశారు.
Bi.P.C. విభాగంలో జె. అంజనా 1000కి 997 మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్గా నిలిచారు. అదేవిధంగా 11 మంది విద్యార్థులు 990 పైగా మార్కులు సాధించారు.
M.P.C. విభాగంలో కె. రుత్విక్ 996, పి. శ్రీనిత్యరెడ్డి, యమ్. రుత్విక, ఎ. లక్ష్మీప్రసన్న వంటి విద్యార్థులు 995కి పైగా మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచారు. మొత్తం 128 మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు, 2293 మంది 900కి పైగా మార్కులు సాధించడం విశేషం.
M.E.C. విభాగంలో వి. అక్షయ్వర్థన్, వి. రిషీత్ ఇద్దరూ 988 మార్కులు,
C.E.C. విభాగంలో బి. గ్రీష్మా 987 మార్కులు సాధించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో, M.P.C. విభాగంలో 470కి గాను 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించడం,
Bi.P.C. విభాగంలో 440కి గాను నభిలాతరీమ్, జోహ మహవీష్, సామా పిరదోష్ 438 మార్కులు సాధించడంతో పాటు,
M.E.C., C.E.C. విభాగాల్లో చిద్విలాసు (491), భవజ్ఞ (493) మెరిశారు.
ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ –
“గతంలో IIT-Mains ఫలితాల్లో విద్యార్థులు అద్భుతంగా రాణించగా, రాబోయే NEET, EAMCET ఫలితాల్లోనూ అఖండ విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. ఇది పటిష్ట ప్రణాళిక, నాణ్యమైన బోధన, విద్యార్థుల కృషి ఫలితం. ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.
