టేకుమట్ల: మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలోని ఫస్ట్ వార్డ్ (కొత్తపల్లి) ప్రజలు తీవ్ర నీటి కొరతతో ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా ఇంటింటికి నీరు సరఫరా అయ్యే నల్లాలు పనిచేయకపోవడం, అలాగే బోరు బావుల్లోనూ నీటి స్థాయి తగ్గిపోవడంతో గ్రామస్థులు నిత్యవసరాలకూ నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి తీవ్రత పెరిగిన తరుణంలో నీటి లభ్యత కరవవడం ప్రజలకు తాగునీరు లభించక అసహనానికి కారణమైంది. “ఇక నీళ్లు తెచ్చుకోవడానికే గ్రామం నుంచి కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
