రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గ్రామ పాలన అధికారి

జగిత్యాల, ఆగస్టు 6 (Zindagi9news): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (GPO) మాథే రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు.
ఫిర్యాదుదారుడి పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు అధికారిక అనుకూలత కల్పించే పేరుతో రూ.5,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు గురువారం ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడి హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, నిర్వహించిన రసాయన పరీక్షలో సానుకూల ఫలితం వచ్చినట్లు తెలిపారు. అనంతరం గ్రామ పాలన అధికారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది.
