సింగరేణిలో 300 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తుల ఆహ్వానం
ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం.. ఆగస్టు 16 వరకు దరఖాస్తులు

హైదరాబాద్, ఆగస్టు 6 (Zindagi9news): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) మరియు డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 300 అప్రెంటిస్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు – 150 పోస్టులు
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు – 100 పోస్టులు
డిప్లొమా హోల్డర్లు – 50 పోస్టులు
అర్హత: 2022, 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
కనీసం 18 సంవత్సరాలు
గరిష్టంగా 28 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు.
స్టైపెండ్:
గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.లు 12,300
డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.లు 10,900
ఎంపిక ఇంటర్ సీనియారిటీ, ఉత్తీర్ణత సంవత్సరం, మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎస్సీసీఎల్ ఉద్యోగుల పిల్లలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పిల్లలు, PAF/PDF అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తుల గడువు: ఆగస్టు 16, 2026 సాయంత్రం 5 గంటల వరకు.
దరఖాస్తు వెబ్సైట్లు:
SCCL అప్రెంటిస్ పోర్టల్: https://scclmines.com/apprenticeship
NATS 2.0 నమోదు:
