మడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

జమ్మికుంట, మే 27(zindagi9news): జమ్మికుంట మండలం మడిపల్లి (శాంతినగర్) గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జమ్మికుంట నుండి వస్తున్న నరిగే రాజ్ కుమార్ (వినయ్) (సుమారు 32), రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.మృతుడు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
