
జమ్మికుంటలో విషాదం: రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట, మార్చి 12: జమ్మికుంట పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి ఓ గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం సదరు వ్యక్తి బ్రిడ్జిపై నుండి ఒక్కసారిగా కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సదరు వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఆత్మహత్యకు గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
