స్పీకర్ తీర్పు: దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వచ్చిన అనర్హత పిటిషన్లను పరిశీలించి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల తరహాలోనే వీరిద్దరిపై కూడా అనర్హత వర్తించదని స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయగా, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూతురు కడియం కావ్యకు మద్దతుగా కడియం శ్రీహరి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
