హరిణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సుజాతనగర్లో కొవ్వొత్తులతో మహిళల నిరసన.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

జూలూరుపాడు, సెప్టెంబర్ 27 (Zindagi9News): వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రపల్లి హరిణిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుజాతనగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. హరిణి చిత్రపటానికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రముఖ అంబేద్కర్వాది వేల్పుల భాస్కర్ మాట్లాడుతూ.. హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా నిందితుల అరెస్టులో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు ఎలాంటి తావు ఉండకూడదని, ప్రభుత్వం వెంటనే స్పందించి హరిణి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మాజీ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ మీరాబి మాట్లాడుతూ.. రోజురోజుకూ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎస్.కె. షకీలా, ఈట వెంకటమ్మ, వేల్పుల వేణమ్మ, గుర్రం ఆరోగ్యం, కేసుపాక సీతారాములు, వేల్పుల బాయమ్మ, కాకటి సరోజిని, గుర్రం కోటేశ్వరి, గద్దల అలివేలు, మంద మెర్సి, కుక్కమూడి అంజమ్మ, వేల్పుల రేణుక, కుక్కమూడి దుర్గ, కవులూరి అరుణ, ఇలారపు ఎస్తేరు, ఈట సంధ్య, వేల్పుల హన్సిక, కుక్కమూడి లాస్య, కాకటి సుందరం, ఎస్.కె. హమీద్, దంసలపూరి గాంధీ, కేసుపాక శ్రీను, కుక్కమూడి ప్రసాద్, కత్తి మనోజ్, దంసలపురి పవన్, కాకటి వెంకన్న, కౌలూరి దుర్గారావు, కుక్కమూడి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
