
చల్లూరుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ బదిలీ చేయాలి
ప్రముఖ విద్యావేత్త బొంగోని రాజయ్య గౌడ్ డిమాండ్
వీణవంక, మే 13 (Zindagi9News): వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బదిలీ చేయాలని ప్రముఖ విద్యావేత్త బొంగోని రాజయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ టు ఆప్షన్‌తో కూడిన విద్యా విధానాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
వీణవంక మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా చల్లూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు విద్యా, క్రీడా రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని అన్నారు.
చదువుల హరివిల్లుగా విరాజిల్లుతున్న చల్లూరు గ్రామంలో విద్యార్థులకు అవసరమైన విద్యా వనరులు, ఉత్తమ బోధన, నాణ్యమైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను చల్లూరుకు తరలించాలని ఆయన కోరారు.
ఈ డిమాండ్‌కు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు తెలుపుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులను సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
