
తెలంగాణలో ముదురుతున్న ఎండలు.. హై అలర్ట్‌లో ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వడదెబ్బ ప్రభావంతో ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ప్రజలు తగినంత నీరు తాగడం, మధ్యాహ్న వేళల్లో బయట తిరగకుండా ఉండటం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
