జమ్మికుంటలో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
జమ్మికుంట: జమ్మికుంటలోని ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోరపల్లి గ్రామానికి చెందిన గిరివేని స్వామి (32) తన ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం జమ్మికుంటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఎఫ్సీఐ గోడౌన్ వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన ఆలీ షరీఫ్ తన ద్విచక్ర వాహనాన్ని అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతూ వచ్చి స్వామి వాహనాన్ని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో స్వామికి తలకు, కాలికి తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మృతుడి తండ్రి గిరివేని కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip
ZINDAGI9NEWS
జమ్మికుంట: రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి