ఆదివాసీ బాధితుడిని మోసం చేసినట్లు ఫిర్యాదు.. ముగ్గురిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్: ప్లాట్ కొనుగోలు పేరుతో ఆదివాసీ వ్యక్తిని నమ్మించి, నకిలీ పత్రాలతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు బ్యాంకు రుణం పొందించి మొత్తం రూ.67.20 లక్షల మేర మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఎల్బీఎస్ నగర్లోని ప్లాట్ నంబర్ 37, సర్వే నంబర్ 45కు సంబంధించిన స్థలాన్ని బాధితుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం అదే స్థలంపై SBI నుంచి రూ.53.50 లక్షల బ్యాంకు రుణం పొందించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తికాకముందే అదనంగా రూ.13.70 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే సదరు స్థలాన్ని 1987లోనే మరో వ్యక్తి కొనుగోలు చేసిన విషయాన్ని దాచిపెట్టి విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో అసలు యజమాని అధికారుల సమక్షంలో ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ఈ విషయంపై బాధితుడు ప్రశ్నించగా కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో సంజయ్నగర్కు చెందిన గటిక లక్ష్మణ్ స్వామి, గటిక క్రాంతి కుమార్, కౌన్సిలర్ తోకల నరేష్ పేర్లు నిందితులుగా నమోదయ్యాయి. వీరిలో గటిక క్రాంతి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు తోకల నరేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ DSP ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు రుణం, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip
ZINDAGI9NEWS
ప్లాట్ పేరుతో మోసం.. నకిలీ పత్రాలతో రూ.53.50 లక్షల SBI రుణం
ప్లాట్ పేరుతో మోసం.. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం