పెద్దపాపయ్యపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద యువకుడి దారుణ హత్య
కత్తితో పొడిచి హత్య.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు.. క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద యువకుడి దారుణ హత్య చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం ఉప్పలపల్లి(ఉప్పల్) గ్రామానికి చెందిన వడిగే రాకేశ్‌ను అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు గల అసలు కారణాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. హత్యకు సంబంధించిన వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించింది. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి పాత్రతో పాటు ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
