కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్ కలెక్టర్ కారు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28 (Zindagi9news) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.
ముందుగా వెళ్తున్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన అడిషనల్ కలెక్టర్ కారు దానిని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ.. వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దెబ్బతిన్న కారును ఇన్సూరెన్స్ ప్రక్రియ నిమిత్తం అక్కడే ఉంచారు. అనంతరం పోలీసులు వేణుగోపాల్‌కు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సివిల్ సప్లైస్ అధికారి కారులో ఆయన కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
