విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు రూ.34 లక్షల బీమా చెక్కులు

హైదరాబాద్, జూన్ 12: విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.34 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అందజేశారు.
బషీర్బాగ్లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు బీమా చెక్కులను అందించి, వారికి అండగా ఉంటామని సజ్జనర్ తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు సయ్యద్ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. సయ్యద్ హుస్సేన్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, సింహగిరి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో యాక్సిస్ బ్యాంక్ వారి కుటుంబాలకు బీమా మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు బ్యాంకు, పోలీసు అధికారులతో కలిసి సయ్యద్ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి రూ.34 లక్షల చొప్పున చెక్కులను సీపీ వీసీ సజ్జనర్ అందజేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
