సర్పంచ్లకు శుభవార్త.. 5 నెలల గౌరవ వేతన బకాయిల విడుదల

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల గౌరవ వేతన బకాయిలను విడుదల చేసింది. ఒక్కో సర్పంచ్ ఖాతాలో రూ.32,500 చొప్పున జమ చేయగా, మొత్తం 12,702 మంది సర్పంచ్లకు రూ.41.28 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఎన్నో రోజులుగా బకాయిల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల బకాయిల చెల్లింపుతో ఆర్థిక భారం కొంత మేర తగ్గనున్నట్లు భావిస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇప్పటికే సంబంధిత సర్పంచ్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం.
