హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనం
ఎల్ అండ్ టీతో ఒప్పందం పూర్తి – రూ.1,461 కోట్లకు 100% షేర్ల బదిలీ
హైదరాబాద్:
హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు ఆధీనంలో ఉన్న మెట్రో సేవలను ఇకపై ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు ద్వారా ఫేజ్–I ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తి చేశారు.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఎల్ అండ్ టీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదిరింది. ఒప్పందం ప్రకారం సంస్థకు చెందిన 100 శాతం షేర్లను రూ.1,461.47 కోట్లకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఈ ఒప్పందంపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ తరఫున డి.కె.సేన్, LTMRHL తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. అలాగే సంస్థపై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేయనుంది. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా, లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందించాయి.
ప్రయాణికులకు మెరుగైన సేవలు:
హైదరాబాద్ మెట్రో ఫేజ్–I ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో నడుస్తోంది. రోజుకు సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులు సేవలను వినియోగిస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి.
మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II విస్తరణ పనులు, ప్రణాళికలు, సేవల అమలు మరింత సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా నగరానికి మరింత సమగ్ర, సౌకర్యవంతమైన మెట్రో నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.
ముఖ్యమంత్రితో భేటీ:

ఒప్పందానికి ముందు ముఖ్యమంత్రి ను ఎల్ అండ్ టీ ఛైర్మన్, ఎండీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
