ఎన్నికల హామీని నిలబెట్టుకున్న వార్డు సభ్యురాలు వైష్ణవి నరేష్
పెద్దంపల్లి గ్రామంలో పెళ్లి వేడుకకు హాజరై ఆర్థిక సహాయం అందజేత

టేకుమట్ల:టేకుమట్ల మండలంలోని పెద్దంపల్లి గ్రామపంచాయతీకి చెందిన 6వ వార్డు సభ్యురాలు బొంగోని వైష్ణవి నరేష్ గౌడ్ తన ఎన్నికల హామీని నెరవేర్చుతూ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తమ వార్డులో జరిగే సామాజిక కార్యక్రమాలకు సహకారం అందిస్తామని చెప్పిన ఆమె, ఆ మాటను నిలబెట్టుకున్నారు.
6వ వార్డుకు చెందిన కన్నూరి సారంగం రాధ కుమార్తె రుష్మిత – శ్రావణ్ కుమార్ వివాహ వేడుకకు హాజరైన వైష్ణవి నరేష్, రూ. 2516 నగదును అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చే ఐదు సంవత్సరాల పాటు తమ వార్డులో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి సందర్భంలో ముందుండి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావు, చిట్యాల శ్రీధర్, కన్నూరి అంజన్, బూడిద సరోత్తం తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
