
హుజురాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు – సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ప్రారంభం
హుజురాబాద్, ఏప్రిల్ 27 (zindagi9news): హుజురాబాద్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన సభ్యుల ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థులు ఎన్నికయ్యారు.
మహిళా జనరల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఆలేటి సుశీల భర్త దామోదర్ (17 ఓట్లు) ఎన్నిక కాగా, జనరల్ కో-ఆప్షన్ సభ్యునిగా గొట్టె జమదగ్ని తండ్రి ఎల్లయ్య (17 ఓట్లు) విజయం సాధించారు. అలాగే మైనారిటి కో-ఆప్షన్ సభ్యుల విభాగంలో మొహమ్మద్ అబ్దుల్ అలీం (17 ఓట్లు) జనరల్ సభ్యునిగా, ఫరీద బేగం (17 ఓట్లు) మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా, జనాభా గణన 2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సుహాసిని రొంటాల, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్ సహా అధికారులు, సిబ్బంది పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
ప్రజలు కూడా మొబైల్ యాప్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకుని పొందే 11 అంకెల SE IDని ఎన్యుమరేటర్కు సమర్పించి జనాభా గణన 2027కు సహకరించాలని అధికారులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
