ఘోర రోడ్డు ప్రమాదం: లారీ కింద పడి మహిళ దుర్మరణం

టేకులపల్లి, సెప్టెంబర్ 21(Zindagi9news): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు ప్రమాదానికి గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణంలో ఉండగా బైక్ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడిన ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతురాలి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో వివరాలు సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
