
బీసీ రాజ్యాధికారం కల సఫలం అవుతుంది: ఈటల రాజేందర్
హైదరాబాద్: బీసీ రాజ్యాధికారం సాధించే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పేర్కొన్నారు.మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బీసీ జన జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్, తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఒకే వేదికపైకి వచ్చిన విధంగానే, ఈరోజు కూడా అదే స్పూర్తి ఈ వేదికపై కనిపిస్తోందన్నారు.నర్సింగ్ రావు చేస్తున్న కృషిని అభినందిస్తూ, బీసీ జన జాతర ఆశయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
బీసీల ఉద్యమం అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని, ప్రతి ఒక్కరూ ఆ ఆశయాన్ని గుండెల్లో పెట్టుకుని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.మనం కలలు కన్న బీసీ రాజ్యాధికారం తప్పకుండా సాకారం అవుతుందని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
