
హైదరాబాద్లో అగ్నిప్రమాదం: గచ్చిబౌలి TNGOs కాలనీలో అపార్ట్మెంట్ సెల్లార్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (Zindagi9News):
నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఉన్న TNGOs కాలనీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్మెంట్ సెల్లార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అపార్ట్మెంట్ సెల్లార్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన నివాసితులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెల్లార్లో మంటలు వేగంగా వ్యాపించడంతో అపార్ట్మెంట్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న నివాసితులు ప్రాణభయంతో భవనం నుండి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొగ ఎక్కువగా ఉండటంతో అపార్ట్మెంట్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కారణం తెలియాల్సి ఉంది:
సెల్లార్లో నిలిపి ఉంచిన వాహనాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
