పీఆర్సీ నివేదికపై త్వరలో నిర్ణయం: సీఎం

హైదరాబాద్: పే రివిజన్ కమిషన్ (PRC) నివేదికను తక్షణమే అందించాలని అధికారులకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
వచ్చే వంద రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ₹6 వేల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డులు జూన్ 1లోగా అందజేస్తామని సీఎం వెల్లడించారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు తమ నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నాయి.
