
మే 5న మెగా జాబ్ మేళా – నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్, మే1(zindagi9news):
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్క్, ఎంప్లాయిమెంట్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్ శాఖల అధికారుల సమక్షంలో జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు.
జిల్లాలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించి మంచి ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ సూచించారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొనే ఈ మేళా ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.వై.ఎస్.ఓ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి తిరుపతిరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
