
Sadasivpet Bill Collector Bribe Case
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఎం. నిఖిల్ రెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు.
ఫిర్యాదుదారుడి ఇంటి ఆస్తి పన్నును రూ.1,04,480 నుండి రూ.49,892కి తగ్గించే ప్రక్రియ పూర్తి చేయడానికి నిఖిల్ రెడ్డి రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి నివాసంలో ఆ నగదును స్వీకరిస్తున్న సమయంలో ACB అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అతన్ని పట్టుకున్నారు.
విచారణలో నిందితుడు ఈ పనికి మొదటగా రూ.35,000 డిమాండ్ చేసినట్లు, అందులో ఇప్పటికే రూ.20,000 తీసుకున్నట్లు వెల్లడైంది. తాజాగా తీసుకున్న రూ.15,000 లంచం మొత్తాన్ని అధికారులు అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ACB అధికారులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
