బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా 5 రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం

హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న నాల్గవ శనివారం, సెప్టెంబర్ 27న ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే HDFC Bank, ICICI Bank, Axis Bank వంటి ప్రైవేట్ బ్యాంకులు సమ్మెలో పాల్గొనడం లేదని సమాచారం.
సమ్మె సమయంలో UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే నగదు విత్డ్రా, చెక్ క్లియరెన్స్, బ్యాంకు బ్రాంచ్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్న ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
కాగా, వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తుగా తమ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
