ప్రతి పాఠశాలకు సమగ్ర ప్రొఫైల్ రూపొందించాలి: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ ప్రతినిధి: జిల్లాలోని ప్రతి పాఠశాలకు సమగ్ర ప్రొఫైల్ రూపొందించి, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, అభివృద్ధి అవసరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను ఆకర్షణీయమైన, ఆదర్శవంతమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని ఆమె సూచించారు. విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, సీపీఓ కార్యాలయ గణాంక అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
