కారులో చిక్కుకుని నాలుగేళ్ల బాలిక మృతి

జూలూరుపాడు, సెప్టెంబర్ 20(Zindagi9news): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె తన్వీ (4) కారులో చిక్కుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఇంటి వద్ద పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో చిన్నారి ఇంటి ముందు నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత కారు లాక్ కావడంతో చిన్నారి అందులోనే చిక్కుకుపోయినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి చిన్నారిని కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో వినోభానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
