ప్రధాని మోదీ సరికొత్త రికార్డు.. నెహ్రూ రికార్డును అధిగమించిన తొలి ప్రధాని

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా అత్యధిక కాలం నిరంతరాయంగా కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014 మే 26న ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మోదీ, 4,399 రోజుల పాలన పూర్తి చేసి, ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
దీంతో దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారులు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.
2014లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ, 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుసగా ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. సుదీర్ఘ కాలం పాటు దేశానికి నాయకత్వం వహించిన ప్రధానిగా ఆయన ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషంగా భావిస్తున్నారు.
