వరంగల్‌లో బాడీబిల్డర్లను టార్గెట్ చేసిన డ్రగ్స్ ముఠా.. ఇంజెక్షన్లు సీజ్ చేసిన అధికారులు

వరంగల్: బాడీబిల్డింగ్ పేరుతో జిమ్‌లకు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యవహారం వరంగల్‌లో వెలుగుచూసింది. చార్బౌలి ప్రాంతంలో మహ్మద్ అబ్దుల్ సొహైబ్ అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ‘టెర్మిన్’ (మెఫెంటర్మైన్ సల్ఫేట్) ఇంజెక్షన్లను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీజీడీసీఏ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సమాచారం మేరకు, బాడీబిల్డింగ్ కోసం జిమ్‌లకు వచ్చే యువతకు ఈ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో డ్రగ్స్ స్టాక్‌ను సీజ్ చేసిన అధికారులు, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వైద్యుల సూచన లేకుండా వినియోగించే మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. యువత ఇటువంటి మత్తు పదార్థాలు, నిషేధిత ఔషధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
