
జమ్మికుంట, మే 29(zindagi9news): జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఖాళీ బిందెలతో కోరపల్లి రహదారిపై నిరసన చేపట్టారు. ఐదు రోజులుగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.చైర్మన్, కౌన్సిలర్లు సమస్యను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు, వెంటనే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
