
రైలు కిందపడి మహిళ ఆత్మహత్య.. అత్త వేధింపులే కారణమా?
జమ్మికుంట–బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఓ మహిళ రైలు కిందపడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట గుర్తుతెలియని మహిళగా భావించిన మృతురాలిని అనంతరం పోలీసులు గుర్తించారు.మృతురాలు వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన పోలు స్వప్న (34)గా గుర్తించారు. భర్త వెంకటేష్, అత్త సుగుణ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి దొప్ప రాజయ్య (కాల్వ శ్రీరాంపూర్) పోలీసులకు తెలిపినట్లు సమాచారం.ప్రారంభంలో మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా వస్తువులు లభించకపోవడంతో గుర్తింపు కష్టమైంది. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
