వయా కరీంనగర్ మీదుగా తిరుపతికి మరో ప్రత్యేక రైలు
ఆగస్టు 2 నుంచి ప్రారంభం: దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన

హైదరాబాద్, జూలై 17 (జిందగీ9న్యూస్):
దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో ప్రత్యేక రైలు సేవను ప్రయాణికుల సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది. అదనపు రద్దీని తగ్గించేందుకు రైలు నెంబర్లు 07015 (నందేడ్ – తిరుపతి), 07016 (తిరుపతి – నందేడ్) మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు కొత్త మార్గంలో రానున్నాయి. ఈ ట్రైన్లు కరీంనగర్, జమ్మికుంట, వరంగల్, మధిర, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన స్టేషన్లలో నిలిచే అవకాశం ఉంది.
నందేడ్ – తిరుపతి (07015) రైలు శనివారం నాడు నందేడ్ నుండి సాయంత్రం 4:50 గంటలకు బయలుదేరి, ఆదివారం ఉదయం 11:30 గంటలకు తిరుపతికి చేరుతుంది.
తిరుపతి – నందేడ్ (07016) రైలు ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, సోమవారం సాయంత్రం 4:00 గంటలకు నందేడ్ చేరుతుంది.
కరీంనగర్: రైలు నంబర్ 07015 రాత్రి 9:41 గంటలకు, 07016 ఉదయం 9:08 గంటలకు.
జమ్మికుంట, వరంగల్, మధిరా, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు Trains On Demand (TOD) కింద 1.3 రెట్లు చార్జీతో నడపనున్నారు. రైల్వే శాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ రైళ్లు ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో నందేడ్ నుంచి తిరుపతికి, ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో తిరుపతి నుంచి నందేడ్కు పరుగులు తీయనున్నాయి.
