36 పాఠశాలలకు శిక్షణ విజయవంతం – AIF & ICE బృందానికి ప్రశంసలు

జమ్మికుంట, జూలై 18:
జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర) జమ్మికుంట ప్రాంగణంలో జూలై 16, 17 తేదీలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల ఓరియంటేషన్ మరియు ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం విజయవంతమైంది. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (AIF) మరియు ICE మద్దతుతో 36 పాఠశాలల HMలకు FLIP & టెక్నో బోధనా అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ప్రాజెక్ట్ సంవత్సర ప్రణాళిక, కార్యకలాపాల రూపకల్పన, ఎక్స్పోజర్ సందర్శనలు, వార్షిక కార్యక్రమాలు వంటి అంశాలపై స్పష్టతనిచ్చేలా సెషన్లు అత్యంత సమాచారపూరితంగా సాగాయి. ముఖ్యంగా NCFE కంటెంట్‌పై శిక్షణ ఉపాధ్యాయుల వ్యక్తిగత, వృత్తిపరమైన ఆర్థిక అవగాహనను పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
NFLAT పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయడంలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. AIF ప్రాజెక్ట్ లీడ్ మహమ్మద్ ఒమర్, ZPHS హెడ్మాస్టర్ వి.సదానందం, క్లస్టర్ కోఆర్డినేటర్లు హబీబ్, శివకుమార్, నీలిమ, షబానా, లిఖిత, స్నేహ పాల్గొన్నారు. శిక్షణను విజయవంతంగా నిర్వహించిన AIF, ICE బృందాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
