
వనపర్తి, పెబ్బేరు | జూన్ 30
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు వాచ్మెన్గా విధులు నిర్వహించిన నరసింహులు ఈరోజు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు గౌని ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు కవిత, షాహిన్ బేగం, మోతె రాముడు, రామన్ గౌడ్, నర్సింహా నాయుడు, ఆంజనేయులు, శంకర్, కార్యదర్శి అనిల్ కుమార్, JMS నిరంజనమ్మ, ఆఫీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన నరసింహుల సేవలను ప్రముఖులు కొనియాడారు.
