
🔷 ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కీలక అంశాలపై చర్చ
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వైద్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
✅ ముఖ్యాంశాలు:
- ధాన్యం కొనుగోలు: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు ధాన్యం కొనుగోలులో ముందుండడం అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు. వారం లోపే నగదు చెల్లింపు.
- ఇందిరమ్మ ఇండ్లు: ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
- వానాకాలం సాగు: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు. ఎరువుల సరఫరా నియమంగా ఉండాలి.
- భూ భారతి: ధరణి చట్టం రద్దు. భూ భారతి పైలట్ ప్రాజెక్టు జూన్ 3న ఎర్రుపాలెంలో ప్రారంభం.
- వైద్యం: ఆరోగ్యశ్రీ అమలుపై నిఘా. ఆసుపత్రుల్లో మందుల లభ్యతను పర్యవేక్షించాలి.
- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం: జూన్ 2న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించాలి.
👉 అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి బట్టి విక్రమార్క అన్నారు.
