
పెబ్బేరు, మే 30: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. MIM పార్టీ పెబ్బేరు మండల అధ్యక్షుడు ఎం.డి ఆఫ్రోజ్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు, నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ 11వ వార్డు నివాసితులైన:
కటికల సమతకి రూ. 11,000 లు
గుజ్జుల భాగ్యమ్మకి రూ. 6,000 లు
మంజూరైన సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. లబ్ధిదారులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MIM మండల ఉపాధ్యక్షుడు జకీర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జయరాజు, జనరల్ సెక్రటరీ అమెర్, జాయింట్ సెక్రటరీ మస్తాన్, నాయకులు ఇర్ఫాన్, రెహన్ తదితరులు పాల్గొన్నారు.
